అఖండ బెనిఫిట్ షో టాక్ ..

అఖండ బెనిఫిట్ షో టాక్ ..

బాలకృష్ణ – బోయపాటి శ్రీను కలయికలో అఖండ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే.గతంలో వీరిద్దరి కలయికలో సింహ , లెజెండ్ చిత్రాలు వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాలు సాధించడం తో అఖండ ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఆ అంచనాలు ఏమాత్రం తగ్గకుండా సినిమాను బోయపాటి తెరకెక్కించినట్లు అభిమానులు చెపుతున్నారు. అఖండ చిత్రం ఈరోజు (డిసెంబర్ 02) వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. ఇతర దేశాల్లో ముందుగానే ప్రీమియర్ షోస్ పడ్డాయి. హైదరాబాద్ లోను మల్లికార్జున , భ్రమరాంబ థియేటర్స్ లలో తెల్లవారుజామున బెనిఫిట్ షోస్ పడ్డాయి. ఈ షోస్ చూసేందుకు అభిమానులు తరలివచ్చారు. ఏపీ లో బెనిఫిట్ షోస్ లేకపోవడంతో అక్కడ నుండి కొంతమంది అభిమానులు ప్రత్యేక బస్సు లో హైదరాబాద్ కు రావడం జరిగింది. ఇక బినెఫిట్ షో చూసిన ప్రతి ఒక్కరు పక్క మాస్ ఎంటర్టైనర్ అని , బాలయ్య నటవిశ్వరూపం మరోసారి చూపించారని అంటున్నారు.

ఇక సోషల్ మీడియా లో వారి అభిప్రాయం ప్రకారం.. ఫస్టాఫ్ మాస్ ఆడియన్స్‌ మెచ్చేలా కిక్కిస్తూ బోయపాటి మరోసారి తన మార్క్ చూపించారని ..ఇక సెకండాఫ్ కూడా అంతకుమించిన మాస్ ఎలిమెంట్స్‌తో అద్భుతంగా తెరకెక్కించారని చెబుతున్నారు. ఎప్పటిలాగే బాలకృష్ణ హోల్ అండ్ సోల్ పర్‌ఫార్‌మెన్స్ చూపించగా హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్, జగపతి బాబు, శ్రీకాంత్‌లు తమ తమ పాత్రలకు న్యాయం చేశారని అంటున్నారు.

ఇక తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాలో మేజర్ అట్రాక్షన్ అని, ఇది కంప్లీట్ మాస్ ప్యాకేజ్ అని ట్వీట్స్ పెడుతున్నారు. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయని అంటున్నారు. బాలకృష్ణ అఘోరా పాత్ర అయితే సినిమాలో హైలెట్ పాయింట్ అంటున్నారు. బాలయ్య నుండి వచ్చే ప్రతి మాస్ డైలాగ్ థియేటర్స్ లలో ఈలలు వేయించిందని..బాలయ్య కు మాత్రమే ఆ డైలాగ్స్ చెల్లుతాయని అంటున్నారు. ఓవరాల్ గా అఖండ మాస్ బ్లాక్ బస్టర్ అని అంటున్నారు.