బాక్స్ ఆఫీస్ వద్ద అఖండ కుమ్మేస్తున్నాడు

నటసింహం నందమూరి బాలకృష్ణ మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు వసూళ్లు రాబడుతున్నాడు. బోయపాటి శ్రీను డైరెక్షన్లో నటించిన అఖండ చిత్రం గురువారం వరల్డ్ వైడ్ గా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. సినిమాకు హిట్ టాక్ రావడం తో విడుదలైన ప్రతి చోట హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లోను అఖండ కలెక్షన్లు కుమ్మేస్తున్నాయి.

అఖండ సినిమా ప్రీమియర్స్ తోనే 331,803 డాలర్లు అందుకొని.. మొదటిరోజు 101,458కోట్ల వసూళ్లు రాబట్టి.. మొత్తంగా 3.24 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో షాక్ ఇచ్చింది. ప్రస్తుతం హాఫ్ మిలియన్ దాటేసినట్లు సమాచారం. నైజాంలో అఖండ 2.24 కోట్లు షేర్ రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ. 15.39కోట్లు రాబట్టగా..రెండో రోజు రూ. 6.83కోట్ల షేర్ రాబట్టింది. దీంతో రెండు రోజుల్లో రెండు రాష్ట్రాల్లో 22కోట్లకు పైగా షేర్ సాధించినట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 29.60కోట్ల వరకు రాగా ..రెండు రోజుల్లో 44కోట్లకు పైగా గ్రాస్ దక్కినట్లు సమాచారం. మరి సినిమా మిగతా వీకెండ్స్ లో ఏ స్థాయిలో వసూళ్లు సాధిస్తుందో చూడాలి.