అజిత్ పవార్ రాజీనామా

శరద్ పవార్ పై మనీ లాండరింగ్ ఆరోపణలు నన్ను బాధించాయి -అజిత్ పవార్

అజిత్ పవార్ రాజీనామా

ముంబయి: ఎన్సీపీ సీనియర్ నాయకులూ మాజీ ఉప ముఖ్యమంత్రి హఠాత్తుగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసారు. దీంతో ఎన్సీపీ పార్టీ శ్రేణులు సందిగ్ధంలో పడ్డాయి. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేరు మహారాష్ట్ర సహకార బ్యాంకు కుంభకోణంలో చేర్చడంతో రాజీనామా చేసి ఉండవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అజిత్ తన నిర్ణయాన్ని మార్చుకోకపోవచ్చు అని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఎవరికి అందుబాటులో లేని అజిత్ కుమారుడితో ఫోన్లో ‘‘నేను గతంలో ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టానంటే దానికి కారణం శరద్‌ పవార్‌. నావల్ల ఆయన ఈ వయసులో నిందలు ఎదుర్కోవాల్సి రావడం బాధాకరం. అందుకే రాజీనామా చేశాను. నావల్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే క్షమించండి’’ గా మాట్లాడినట్లుగా తెలుస్తుంది. కుటుంబ పెద్దగా అజిత్‌ రాజీనామా వ్యవహారంపై అన్ని విషయాలను తెలుసుకుంటాను. మా కుటుంబంలో ఎటువంటివ విభేదాలు లేవు. నేను చెప్పింది మా వాళ్లందరూ పాటిస్తార’ని శరద్‌ పవార్‌ తెలిపారు.

మరో నెల రోజుల్లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అయితే అక్టోబర్‌ 1 నుంచి అజిత్‌ పవార్‌ రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తారని, ఎన్సీపీ అభ్యర్థుల నామినేషన్ల దాఖలకు హాజరవుతారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

తాజా క్రీడా వార్తల కోసం https://www.vaartha.com/news/sports/