డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణం

ఆదిత్య ఠాక్రే కు కేబినెట్‌లో చోటు

Ajit Pawar
Ajit Pawar

ముంబయి: మహారాష్ట్రలో మంత్రివర్గం పూర్తిసాయిలో కొలువుదీరింది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారి ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయనతో పాటు అశోక్ చవాన్, ఎన్సీపీ నేత ధనంజయ్ ముండే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన 32 రోజుల తర్వాత మహారాష్ట్రలో మంత్రివర్గ విస్తరణ జరగడం విశేషం. మొత్తం 36 మందితో మహారాష్ట్ర మంత్రివర్గం కొలువుదీరనుంది. వీరిలో 26 మంది ఎన్సీపీ, శివసేన నుంచి(రెండు పార్టీల నుంచి 13, 13 మంది చొప్పున), కాంగ్రెస్ నుంచి 10 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ముంబయి లోని విధానభవన్‌లో ఈ కార్యక్రమం జరిగింది.

తాజా ఎడిటోరియల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/editorial/