స్లిప్‌లో రహానే క్యాచ్‌లు మిస్‌ !

కారణం చెప్పిన ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌ శ్రీధర్‌

ind vs ban
ind vs ban

ముంబయి: ఈడెన్‌ గార్డెన్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన చారిత్మ్రక డే నైట్‌ టెస్టులో స్పిన్నర్‌ రవీంద్రన్‌ అశ్విన్‌ బౌలింగ్‌లో రహానే స్లిప్‌లో క్యాచ్‌ మిస్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే పిచ్‌ కారణంగానే టీమిండియా వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె బంగ్లాదేశ్‌ టెస్టులో క్యాచ్‌లను అందుకోలేకపోయాడని భారత జట్టు ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌ శ్రీధర్‌ అభిప్రాయపడ్డారు. రహానే స్లిప్‌లో క్యాచ్‌లను జారవిడిచినప్పుడు ఆశ్చర్యానికి గురయ్యానని అన్నాడు. ఎందుకంటే ప్రపంచ ఉత్తమ స్లిప్‌ ఫీల్డర్లలో అతడు ముందుంటాడు. అతడి ఫీల్డింగ్‌లో లోపాలు కనిపించడానికి ఇండోర్‌ పిచ్‌ కారణం అని అన్నారు. పిచ్‌లో అనూహ్యంగా బౌన్స్‌ లభిస్తుంది. అంతేకాకుండా స్లిప్‌ స్థానం నుంచి రహానే కొంచెం ముందు నిలబడ్డాడు. దీంతో బంతి అతని ఛాతిపైకి వచ్చింది. దీంతో బంతికి తగ్గట్టుగా రహానే స్పందిలేకపోయాడు శ్రీధర్‌ చెప్పుకొచ్చాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను టీమిండియా స్వీప్‌ చేసిన విషయం తెలిసిందే.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/