చైనాలో ఆసక్తికర ఘటన

డ్రైవర్ ఉపాయంతో సమస్య పరిష్కారం


A plane getting stuck under a footbridge 

చైనా:బ్రిడ్జి కింద ఇరుక్కుపోయిన విమానానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చైనాలోని హర్బిన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. న్యూ చైనా టీవీ కథనం ప్రకారం… విడగొట్టిన విమానాన్ని ట్రైలర్ ట్రక్కు ద్వారా తరలిస్తుండగా బ్రిడ్జి కింద అది ఇరుక్కుపోయింది. దాన్ని ముందుకు కదిలించేందుకు చాలా కష్టపడ్డారు.

అయితే, ట్రక్కు డ్రైవర్ ఉపాయంతో సమస్య పరిష్కారమయింది. ట్రక్కు టైర్లలో గాలిని తగ్గించడంతో… ట్రక్కు ఎత్తు కొంచెం తగ్గింది. దీంతో, ట్రక్కు ముందుకు సాగింది. ట్రైలర్ ట్రక్కు టైర్లు చాలా పెద్ద సైజులో ఉంటాయి. బ్రిడ్జి కింద నుంచి వెలుపలికి వచ్చాక, టైర్లలో మళ్లీ గాలిని నింపారు. ఆ తర్వాత విమానంతో కూడిన ట్రక్కు తన గమ్యస్థానానికి బయల్దేరింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/