మహిళా పైలెట్‌కు కెప్టెన్‌ వేధింపులు

స్పందించిన ఎయిరిండియా

AIRINDIA
AIRINDIA

న్యూఢిల్లీ: ఎయిరిండియా మహిళా పైలెట్‌పై ఓ సీనియర్‌ కెప్టెన్‌ వేధింపులకు పాల్పడ్డారు. కెప్టెన్‌ అసభ్యంగా మాట్లాడడంతో ఆమె యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. దీంతో స్పందించిన ఎయిరిండియా సదరు సీనియర్‌ ఉద్యోగిపై విచారణ చేపట్టింది.
ఇటీవల మహిళా పైలట్‌, కెప్టెన్‌ కలిసి ఓ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు. శిక్షణ పూర్తయిన అనంతరం కెప్టెన్‌ సదరు మహిళా పైలట్‌ను ఓ రెస్టారెంట్‌లో డిన్నర్‌కు పిలిచాడు. ఆ డిన్నర్‌కు మహిళా పైలెట్‌ వెళ్లారు. రెస్టారెంట్‌కు వెళ్లిన తర్వాత కెప్టెన్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టారని సదరు మహిళ ఫిర్యాదులో పేర్కొన్నారు. మీరు భర్తకు దూరంగా ఎలా ఉండగలుగుతున్నారు అంటూ అభ్యంతరకరంగా మాట్లాడారని తెలిపారు. మహిళా పైలెట్‌పై స్పందించిన ఎయిరిండియా యాజమాన్యం సదరు కెప్టెన్‌పై విచారణ చేపట్టినట్లు తెలిపింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/