పాక్‌ ఆంక్షల వల్ల ఎయిరిండియాకు 300కోట్ల నష్టం

Air India
Air India

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌లోని జైషే మహ్మద్‌ ఉగ్ర శిబిరాలపై భారత వైమానిక దళం దాడి తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా పాక్‌ తమ గగనతలం మీదుగా భారత విమానాల రాకపోకలపై పాక్‌ ఆంక్షలు విధించింది. బ్రవరి 27 నుంచి పాక్‌ తన గగనతలాన్ని మూసివేసింది. కాగా ఈ ఆంక్షల కారణంగా భారత విమానయాన సంస్థ ఎయిరిండియాకు భారీ నష్టం వాటిల్లింది. ఈ మేరకు తాజా నివేదిక వెల్లడించింది.
పాక్ తమ గగనతలాన్ని మూసివేయడంతో అమెరికా, యూరప్‌ వెళ్లేందుకు భారత విమానయాన సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాల్సి వచ్చింది. ఈ ప్రత్యామ్నాయ మార్గాల్లో విమానాలు ప్రయాణించే దూరం ఎక్కువగా ఉండటంతో పాటు సిబ్బంది వినియోగం కూడా పెరిగింది. దీంతో రోజుకు రూ. 6కోట్లు చొప్పున ఎయిరిండియా రూ. 300కోట్లకు పైగా నష్టపోయినట్లు తాజాగా ఓ నివేదిక పేర్కొంది. నష్ట తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఎయిరిండియా పౌర విమానయాన శాఖను ఆశ్రయించి నష్టపరిహారం కోరినట్లు తెలుస్తోంది.

మరిన్ని తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/