మధ్యప్రదేశ్లో కుప్పకూలిన యుద్ధ విమానం
Air Force’s Mirage-2000 Crashes In Madhya Pradesh, Pilot Ejects Safely
భూపాల్: మధ్యప్రదేశ్లోని బేండ్ జిల్లాలో భారతీయ వైమానిక దళానికి చెందిన మిరేజ్-2000 యుద్ధ విమానం కుప్పకూలింది. అయితే ఆ విమానంలో ఉన్న పైలట్ సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది. బేండ్కు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న మాన్కాబాద్ ఖాళీ భూముల్లో విమాన శిథిలాలు పడ్డాయి. ఫైటర్ జెట్ మిరేజ్-2000 కూలిన ప్రదేశాన్ని పోలీసులు కార్డెన్ చేశారు. విమానానికి చెందిన తోక భాగం సగం భూమిలోపలకి చొచ్చుకు వెళ్లింది. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం అందాల్సి ఉన్నది.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/