కోహ్లీ సారథ్యంలో క్రికెట్‌ ఆడాలని ఉంది

Sreesanth
Sreesanth

న్యూఢిల్లీ: స్పాట్‌ఫిక్సింగ్‌ ఆరోపణలతో జాతీయ జట్టుకు దూరమైన శ్రీశాంత్‌కు ఊరట లభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అతడు మీడియాతో మాట్లాడాడు. టెస్టుల్లో వంద వికెట్లు తీయడమే తన లక్ష్యమని భారత బౌలర్‌ క్రికెటర్‌ శ్రీశాంత్ అన్నాడు. అంబుడ్స్‌మన్ నిర్ణయం ఎంతో సంతోషాన్నిచ్చింది. నా కోసం దేవుడిని ప్రార్థించిన శ్రేయోభిలాషులకి ధన్యవాదాలు. ఇప్పుడు నా వయసు 36. వచ్చే ఏడాదితో నా శిక్ష ముగుస్తుంది. అప్పటికీ నాకు 37 ఏళ్లు వస్తాయి. టెస్టుల్లో ఇప్పటి వరకు 87 వికెట్లు పడగొట్టాను. 100 వికెట్లు తీసి నా కెరీర్‌ను ముగించాలనేదే లక్ష్యం. టీమిండియాలో తిరిగి స్థానం దక్కించుకుంటాననే నమ్మకం ఉంది. విరాట్‌ కోహ్లీ సారథ్యంలో క్రికెట్‌ ఆడాలని ఉంది. అని శ్రీశాంత్‌ పేర్కొన్నాడు.
కాగా జీవితకాల నిషేధానికి గురైన అతడికి బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ డీకే జైన్‌ శిక్షను ఏడేళ్లకు కుదించారు. ఇప్పటికే ఆరేళ్ల పాటు నిషేధం పూర్తిచేసుకున్న అతడి శిక్ష 2020 ఆగస్టులో ముగుస్తుంది.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/