గుండెపోటుతో ఎమ్మెల్యే మృతి

kanagaraj , mla
kanagaraj , mla

చెన్నై: ఏఐఏడీఎంకే శాసనసభ్యుడు ఆర్‌. కనగరాజ్‌(67) గుండెపోటుతో ఈ ఉదయం మృతిచెందారు. సులార్‌ నియోజకవర్గ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సీఎం పళనిస్వామితో పాటు పలువురు మంత్రులు నివాళి అర్పించేందుకు కోయంబత్తూరు బయల్దేరి వెళ్లనున్నారు.
కనగరాజ్‌ మృతితో తమిళనాడు అసెంబ్లీలో ఏఐఏడీఎంకే సంఖ్యా బలం 113కు తగ్గింది. మెజారిటీకి ఐదు స్థానాలు తక్కువ. కాగా అసెంబ్లీలో మొత్తం 22 స్థానాలు ఖాళీ అయ్యాయి. లోక్‌సభ ఎన్నికలతో పాటు తమిళనాడులో ఖాళీ అయిన 18 స్థానాలకు ఉప ఎన్నికలను నిర్వహిస్తున్నారు. మిగతా మూడు స్థానాలకు ఎన్నికలు నిర్వహించవద్దని డీఎంకే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కోర్టులో కేసు పెండింగ్‌ కారణంగా ఎన్నికల సంఘం ఆ స్థానాలకు ఎన్నికలను నిర్వహించడం లేదు.