కల్తీని అరికట్టాలంటే వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి

ఇపుడు మనం తినేది ప్రతిదీ కల్తీ

Agriculture
Agriculture

ముఖ్యాంశాలు

  • డబ్బుకు కక్కుర్తిపడి కొందరు వ్యాపారులు అడ్డదారులు
  • ఇదే అలుసుగా రెచ్చిపోతున్న కల్తీదందా
  • పాలకులు ఇప్పటికైనా కళ్లు తెరవాల్సిన అవశ్యం

ఏదయినా వస్తువు మార్కెట్లో దొరకడం లేదు. కొరత ఉంది అంటే అది కల్తీది రావడం గ్యారంటీ. ఇప్పుడు మనం తినేది ప్రతిదీ కల్తీనే అవుతోంది. ఎందుకంటే మన అవసరాలకు దగ్గ విధంగా ఉత్పత్తి జరగడం లేదు.

కనుక ముఖ్యంగా ఆహార వస్తువుల విషయంలో ఇది కనపడుతుంది. ఎప్పుడైతే కొరత ఉందో అప్పుడు కల్తీదందా ప్రారంభమైనట్లే. కష్టపడకుండా పెట్టుబడి లేకుండా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో కొందరు ప్రజల జీవితాలతో ఆడు కుంటారు. వారికి డబ్బు సంపాదన ప్రామాణికం తప్ప ప్రజల ఆరోగ్యం ముఖ్యంకాదు.

అలాగే కొందరు పెద్ద పెద్ద వ్యాపారస్తులు కూడా డబ్బుకు కక్కుర్తిపడి లాభాలు రావా లని అడ్డదారులు తొక్కుతారు, అక్రమాలకూ పాల్పడతారు.

కొన్ని వస్తువులు డబ్బు పెట్టిన ఒక్కొక్కసారి దొరకకపోవ చ్చు. ఎందుకుంటే అవసరాలు ఎక్కువగా లభ్యత తక్కువ ఉంటుంది. దీనిని ఆసరా చేసుకొని కల్తీ దందా చేసేవాళ్లు దొరికిందే అవకాశంగా రెచ్చిపోతారు.

అసలే దొరకడం లేదు పైగా రూపాయి తక్కువకు దొరుకుతుంది అంటే అమాయక ప్రజలు కొంటారని వారికి తెలుసు ఇలా యధేచ్ఛగా తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటారు.

మన దేశంలో ప్రతిదీ కల్తీనే అంటూ ఇటీవల సోషల్‌ మీడియాలో వాట్స్‌ఆప్‌లలో వస్తున్న వీడియోలు చూస్తుంటే అర్థం అవుతుంది.

దానికి తోడు అప్పుడప్పుడు టాక్స్‌ఫోర్స్‌ చేసే దాడులలో బయటపడుతున్న నిజాలు చూస్తుంటే భయం వేస్తుంది.

ఇప్పటికయినా ప్రభుత్వాలు గమనించాలి. వ్యవసాయ కదేలవ్ఞతే పశుసంపద తగ్గితే వాణిజ్యపంటలు పెరిగితే,కల్తీ ఎలాపుట్టుకొచ్చిందో జనాభాకు తగ్గట్టుగా ఆహార ఉత్పత్తులను ఉత్పత్తి చేయకపోతే ధరలు పెరగడమేకాకుండా కల్తీ కూడా పెరుగుతుంది.

అందుకే సమగ్ర వ్యవసాయ విధానం రూపొందించి దానిని ఆచరణలోపెట్టాలి. వ్యవసాయాన్ని లాభసాటి చేయాలి.

ప్రజలకు అవసరమైన ఆహారఉత్పత్తులు ఉత్పత్తి అయ్యేలా చర్యలు చేపట్టాలి. అప్పుడు అటు రైతు లాభపడతాడు. ఇటు కొనుగోలుదారుడికి కూడా కల్తీలేని ఆహార ఉత్పత్తులు సరసమైన ధరకు దొరికి ప్రయోజనం జరుగుతుంది.

కరోనా ప్రభావంతో అందరూ పల్లెబాట పడుతున్నారు. నగరాల కన్నా గ్రామాలే సురక్షితం అన్న భావం కలుగుతుంది. అందుకే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలి.

వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలి.

  • పివి.శ్రీనివాసరావు

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/