మంత్రి సోమిరెడ్డికి షాక్‌ ఇచ్చిన అధికారులు!

Somireddy Chandramohan Reddy
Somireddy Chandramohan Reddy

అమరావతి: ఏపి వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమెహన్‌రెడ్డికి వ్యవసాయశాఖ అధికారులు రెండో రోజు కూడా షాక్‌ ఇచ్చారు. అయితే మంత్రి సమీక్షకు ఈరోజు కూడా హాజరుకాకుండా ఆయనకు ఝలక్‌ ఇచ్చారురు. మంత్రి సోమిరెడ్డి నిన్న ఉద్యానవన శాఖ సమీక్ష ఏర్పాటు చేశారు. అయితే ఆ సమీక్షకు వ్యవసాయ శాఖ అధికారులు ఏవరూ హాజరుకాకపోవటంతో చేసేదేమీ లేక సమీక్షను రద్దు చేసుకున్నారు. ఈ రోజైనా సమీక్ష నిర్వహించాలని భావించిన సోమిరెడ్డి! అధికారులు రావాలని ఆదేశించారు. కానీ నిన్నటి మాదిరిగానే వ్యవసాయ అధికారులు హాజరుకాకపోవటంతోమంత్రి సమీక్ష రద్దు చేసుకున్నారు.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/