‘వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందే’
కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ డిమాండ్

Nizamabad: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని మాజీమంత్రి , కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు.
రైతులు చేస్తున్న పోరాటానికి సంఘీ భావం ప్రకటించిన కాంగ్రెస్ వారికి మద్దతుగా ఉంటుందని అన్నారు. కేంద్రం తీసుకువచ్చిన చట్టాలు కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాచేలా ఉన్నాయన్నారు.
రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర కేటాయించేలా చట్టాలను రూపొందించాలని సూచించారు. తెలంగాణలో రైతులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోని దుస్థతిలో పాలకులు ఉన్నారని అన్నారు.
తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/