క్లాస్ రూమ్ లో పాఠాలు చెప్పాల్సిన క్లాస్ టీచర్లు..పాటలకు డాన్సులు వేసి రచ్చ చేసారు

విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన క్లాస్ టీచర్లు..క్లాస్ రూమ్ ను టైం పాస్ అడ్డాగా మార్చుకున్నారు. పాఠాలకు బదులు పాటలు పాడుతూ డాన్సులు చేస్తూ నానా రచ్చ చేసారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అచ్నేరా జిల్లా సంధాన్ పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే..

ఉత్తరప్రదేశ్లోని అచ్నేరా జిల్లా సంధాన్ పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐదుగురు అసిస్టెంట్ టీచర్లు తరగతి గదిలో సినిమా పాటలకు డాన్సులు చేసారు. పాఠశాల ఉపాధ్యాయునులు రష్మీ సిసోడియా, జీవికకుమారి, అంజలియాదవ్, సుమన్ కుమారి, సుధారాణిలనే ఐదుగురు మహిళా టీచర్లు తరగతి గదిలోనే ‘‘మైను లెగెంగా లేదే మెహంగా’’ అనే సినిమా పాటకు డాన్స్ చేస్తూ నానా రచ్చ చేసారు. ఈ డాన్స్ లు సోషల్ మీడియా లో వైరల్ కావడం తో ఫై అధికారుల దృష్టికి వెళ్లింది. టీచర్లు క్లాస్ రూంలోనే డాన్స్ చేసి అనుచితంగా ప్రవర్తించి విద్యా శాఖ ప్రతిష్ఠను దిగజార్చారని, ప్రభుత్వ ఉద్యోగుల నిబంధనలు 1978 , విద్యాహక్కు చట్టం ఉల్లంఘన కింద వారిని సస్పెండ్ చేశారు.