సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మృతి..?

అగ్నిపథ్ కు వ్యతిరేకంగా ఈరోజు ఉదయం నుండి ఆర్మీ విద్యార్థులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆందోలన ఉద్రికత్తకు దారి తీయడం తో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం అందుతుంది. అలాగే పదుల సంఖ్యలో యువకులకు గాయాలు కావడం తో వారిని గాంధీ ఆసుపత్రి లో చికిత్స అందిస్తున్నారు. అగ్నిపథ్ కు వ్యతిరేకంగా గత మూడు రోజులుగా దేశ వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నా విషయం తెలిసిందే. పెద్ద ఎత్తున విద్యార్థులు రోడ్ల పైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. బీహార్ , రాజస్థాన్ , యూపీ వంటి రాష్ట్రాల్లో పలు రైల్వే స్టేషన్లలో ఆందోళలన చేపట్టి , పలు రైళ్లకు నిప్పు పెట్టడం జరిగింది.

ఇక ఈరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అదే జరిగింది. వందలాది మంది ఆర్మీ విద్యార్థులు ఒక్కసారిగా రైల్వే స్టేషన్ లోకి చొరపడి పలు రైళ్లను అడ్డుకోవడం, రైళ్ల ఫై రాళ్ల దాడి చేయడం , పలు రైళ్లకు నిప్పు పెట్టడం తో ఉద్రిక్తత చోటుచేసుకుంది. విద్యార్థుల ఆందోళలంతో ప్రయాణికులు భయంతో వణికిపోయారు. తమ లగేజ్ ని అక్కడే వదిలేసి స్టేషన్ నుండి బయటకు పరుగులు పెట్టారు. రైల్వే ట్రాక్ పై ప్లకార్డులు పట్టుకుని నిరసన చేపట్టారు. సేవ్ ఆర్మీ పేరుతో ప్లకార్డులు ప్రదర్శించారు. విద్యార్థులు పట్టాలపై బస్తాలు, డబ్బాలు వేశారు. పలు చోట్ల పట్టాల మధ్య నిప్పు పెట్టారు. రైలు ముందు కదలకుండా అడ్డుకున్నారు. దీంతో పలు రైళ్లను నిలిపివేశారు అధికారులు. రైల్వే స్టేషన్ లో సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. మెరుపు ధర్నాలతో పోలీసులు ఏం చేయలేకపోయారు. ఇప్పుడిప్పుడే పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

దాదాపు రెండేళ్ల నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ఏమీ లేకపోవడంతో విద్యార్థులు, నిరుద్యోగులు ఆందోళన బాట పట్టారు. కరోనా కారణంగా రెండేళ్ల క్రితమే నిర్వహించాల్సిన ఆర్మీ ఎగ్జామ్ కూడా వాయిదా పడడంతో… ఈ ఉద్యమం మరింత ఉద్ధృతమైంది. హాల్ టికెట్స్ ఇచ్చినా పరీక్ష నిర్వహించలేదని అభ్యర్థులు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా వారిలో త్వరలోనే కొందరికి ఏజ్ బార్ కూడా కానుండడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అగ్నిపథ్ అంశం తెరపైకి రావడంతో అభ్యర్థులు అగ్రం వ్యక్తం చేస్తున్నారు.