సిఎం నివాసం వద్ద ఆరోగ్యమిత్రల ఆందోళన

arogya-mitras womens agitation
arogya-mitras womens agitation

అమరావతి: ఏపి సిఎం జగన్‌ తాడేపల్లిలోని నివాసం వద్ద ఆరోగ్యమిత్రలు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనలో 13 జిల్లాల ఉండి పెద్ద ఎత్తున మహిళల పాల్గొన్నారు. తాము 11 ఏళ్లుగా పని చేస్తున్నప్పటికి తమను కాదని ప్రభుత్వం కొత్తగా నియమిస్తున్న వాలంటీర్లకు తమ విధులు అప్పగిస్తారన్న సమాచారం ఉందని వారు తెలిపారు. అయితే జీతం లేకపోయినా కేవలం కమీషన్‌ ప్రాతిపదికన పని చేస్తున్నామని వారు తెలిపారు. గ్రామ వాలంటీర్లను తీసుకుంటే తమను తొలగిస్తారనే ప్రచారం జరుగుతోందని, దీనిపై ముఖ్యమంత్రి స్పందించి న్యాయం చేయాలని కోరారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/