ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల శాశ్వత నివాసాలు

న్యూఢిల్లీ: ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు రైతులు టీకరి బోర్డర్ దగ్గర పక్కా ఇళ్లు నిర్మించుకోవడం ప్రారంభించారు. ఇందుకోసం వివిధ ప్రాంతాల నుంచి ఇటుకలు, ఇసుక, సిమెంట్ ఇక్కడికి తరలిస్తున్నారు. ఈ విధంగా ఇప్పటికే 12పైగా పక్కాఇళ్లు నిర్మితమయ్యాయి.

ఈ సందర్భంగా రైతు సంఘం నేత ఒకరు మాట్లాడుతూ.. గ్రామాల్లో గోధుమల పంట కోతకు వచ్చిందని, ఇటువంటి సమయంలో ట్రాక్టర్, ట్రాలీ అవసరమవుతాయన్నారు. ఇప్పటి వరకూ ట్రాలీలలో ఉంటున్నాం. వాటిని గ్రామానికి పంపించేస్తే తాము ఎక్కడ ఉండాలి? ఈ సమస్య పరిష్కారం కోసమే ఇక్కడ ఇళ్లను నిర్మించుకుంటున్నామని అన్నారు. ఇక్కడ ఒక్కో ఇంటిని నిర్మించుకునేందుకు రూ. 20 నుంచి 30 వేల రూపాయల వరకూ ఖర్చవుతున్నదన్నారు. తమ సమస్య పరిష్కారమయ్యే వరకూ ఇక్కడి నుంచి కదిలేదిలేదని రైతులు చెబుతున్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: