వృద్ధాప్య పింఛను అర్హత వయసు తగ్గిస్తాం

అమరావతి: ఎన్నికల వేళ పార్టీలు హామీల వర్షం కురిపిస్తుంటారు. ఇందులో భాగంగానే ఏపి సియం చంద్రబాబు హామీ ఇస్తూ మళ్లీ అధికారంలోకి వస్తే పింఛన్లను రూ. 3 వేలకు పెంచుతామని , వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసును తగ్గిస్తామని తెలిపారు. సోమవారం ఆయన పార్టీ నేతలతో టెలికాన్ఫ్రెన్స్ నిర్వహించారు.
జగన్‌వి పిరికిపంద రాజకీయాలని, కేసిఆర్, కేటిఆర్‌కు భయపడుతూ వారివద్ద బానిసలా ఉన్నాడని దుయ్యబట్టారు. 60 ఏళ్లు కష్టపడిన ఆస్తులను వారు లాగేసుకున్నారని, ఇప్పుడు జగన్ రూపంలొ మనం కష్టపడి నిర్మించుకున్న నవ్యాంధ్ర ఆస్తులను కూడా లాగేందుకు కుట్ర పన్నారని కేసిఆర్‌ను ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌కు తిరిగి పూర్వవైభవం రావాలంటే ఇక్కడ అసమర్ధ ప్రభుత్వం ఉండాలనేది కేసిఆర్ భావన అని చంద్రబాబు అన్నారు.