ఎన్నికల కోడ్ ముగిశాక జీవో విడుదల చేస్తాం

kcr
kcr

వికారాబాద్ : వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్ లో కలపాలన్న డిమాండ్ ఉందని, ఈ డిమాండ్ ను నెరవేరుస్తామని, ఈ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత జీవో విడుదల చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. వికారాబాద్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, గతంలో వికారాబాద్ జిల్లా కావాలనే డిమాండ్ ఉండేదని, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకే ఆ డిమాండ్ ను నెరవేర్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ సందర్భంగా తెలంగాణలో తీసుకురానున్న కొత్త రెవెన్యూ చట్టం గురించి ఆయన ప్రస్తావించారు. జూన్ తర్వాత ఈ చట్టం అమల్లోకి తీసుకొస్తామని, రైతులు ఎవరికీ లంచాలో ఇవ్వొద్దని, వారి సమస్యలు పరిష్కరించే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. \

మరిన్నీ తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి : https://www.vaartha.com/telengana