హెన్రీ నికోలస్‌ అద్భుతమైన క్యాచ్‌

australia vs new zealand
australia vs new zealand

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాున్యూజిలాండ్‌ మధ్య జరుగుతున్న బాక్సింగ్‌ డే టెస్టులో కివీస్‌ ఆటగాడు హెన్రీ నికోలస్‌ అద్భుతమైన రీతిలో క్యాచ్‌ పట్టి ఔరా అనిపించాడు. న్యూజిలాండ్‌ బౌలర్ వాగ్నెర్ వేసిన బౌన్సర్‌ను డిఫెండ్‌ ఆడటానికి ప్రయత్నించిన ఆసీస్‌ ఆటగాడు స్టీవ్‌స్మిత్‌.. నికోలస్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. నికోలస్‌ వెనక్కి దూకుతూ బంతిని ఒంటి చేత్తితో అద్భుతంగా అందుకున్నాడు. క్యాచ్‌ పట్టిన తర్వాత కిందపడకుండా తనని తాను నియంత్రించుకున్న తీరు అందర్నీ ఆకట్టుకుంది. అయితే ఈ వీడియోను ఐసీసీ ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ.. ఖఈ క్యాచ్‌కు మీరు ఎంత రేంటింగ్‌ ఇస్తారగని నెటిజన్లను ప్రశ్నించింది. దీంతో అందరూ పదికి పది అంటూ కామెంట్ల జల్లు కురిపిస్తున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/