కేజీఎఫ్ తరువాత వస్తోన్న కోబ్రా.. పండగకు ఫుల్ మీల్స్!

కేజీఎఫ్ తరువాత వస్తోన్న కోబ్రా.. పండగకు ఫుల్ మీల్స్!

సౌత్ ఇండియా ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ తనదైన శైలిలో తెరకెక్కిస్తుండగా, భారీ తారాగణం ఈ సినిమాలో నటిస్తోంది. ఇక కేజీఎఫ్ చిత్రంతో కన్నడ హీరో యశ్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను జనవరి 8న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసింది.

ఇక ఈ టీజర్ కోసం యావత్ సౌత్ ఇండియా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ టీజర్ తరువాత మరో టీజర్ యావత్ సౌత్ ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతోంది. తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న తాజా చిత్రం ‘కోబ్రా’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టీజర్‌ను జనవరి 9న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.

ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న లెజెండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ పుట్టినరోజు సందర్భంగా ఈ మేరు ప్రకటన చేశారు చిత్ర యూనిట్. అజయ్ జ్ఞ్యాన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో విక్రమ్ ఏకంగా 20 పాత్రల్లో నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో నెలకొన్నాయి. మరి ఈ సినిమా టీజర్‌కు ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.