ఇక హైదరాబాద్ పరిధిలో రాత్రి 9.30 తరువాతే డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు!

ఫిర్యాదులు రావడంతో స్పందించిన ఉన్నతాధికారులు

హైదరాబాద్: ఇటీవలి కాలంలో మందు కొట్టి వాహనాలను నడుపుతూ పట్టుబడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుండటంతో హైదరాబాద్ పరిధిలో సాయంత్రం నుంచే డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలకు పోలీసులు దిగుతున్నారు. దీంతో తనిఖీలు చేస్తున్న అన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఈ విషయంలో తము పడుతున్న ఇబ్బంపదుల గురించి తెలుపుతూ, వాహనదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఉన్నతాధికారులు స్పందించారు.

రాత్రి 9 గంటల్లోపు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించేందుకు సరైన సమయం కాదని భావించిన ట్రాఫిక్ విభాగం, 7 తరువాత ఎక్కడెక్కడ డ్రైవ్ లను జరిపారన్న విషయాన్ని ఆరా తీశారు. కొంతమంది ట్రాఫిక్ పోలీసులు అత్యుత్సాహంతో ఈ పని చేసి ఉంటారని భావిస్తూ, రాత్రి 9.30 గంటల తరువాతనే పరీక్షలు చేయాలని గురువారం నాడు ఆదేశాలు జారీ చేశారు. మందుబాబులు కూడా 10 గంటల తరువాతనే రోడ్లపైకి వస్తారన్న అంచనాతోనే, అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో రాత్రి 9.30 తరువాతే డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలను నిర్వహించాలని ఆదేశించామని ఉన్నతాధికార వర్గాలు వెల్లడించాయి

తాజా ఏపీ కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/