నేడు తాలిబన్లతో ఆఫ్గనిస్తాన్‌ శాంతి చర్చలు

నేడు తాలిబన్లతో ఆఫ్గనిస్తాన్‌ శాంతి చర్చలు
Historic talks begin between Taliban, Afghan government

ఆఫ్గనిస్తాన్‌: ఈరోజు ఆఫ్గనిస్తాన్ ప్ర‌భుత్వం, తాలిబ‌న్ మ‌ధ్య దోహాలో శాంతి చ‌ర్చ‌లు ప్రారంభంకానున్నాయి. చ‌ర్చ‌లు చ‌రిత్రాత్మ‌కం అంటూ అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో కామెంట్ చేశారు. ఫిబ్ర‌వ‌రిలో అమెరికా, తాలిబ‌న్ మ‌ధ్య కుదిరిన సెక్యూర్టీ డీల్‌లో భాగంగా ఈ చ‌ర్చ‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు. వివాదాస్ప‌దంగా మారిన ఖైదీల అప్ప‌గిం‌త విష‌యంలో శాంతి చ‌ర్చ‌లు కొంత కాలం కుంటుప‌డ్డాయి. ఆఫ్గ‌న్ బృందానికి అబ్దుల్లా అబ్దుల్లా నాయ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చ‌ర్చ‌ల్లో పాల్గొన‌నున్న‌ట్లు తాలిబ‌న్ కూడా గురువారం ప్ర‌క‌ట‌న చేసింది. ఆఫ్గ‌న్ ప్ర‌భుత్వం, తాలిబ‌న్ మ‌ధ్య నేరుగా చ‌ర్చ‌లు జ‌ర‌గ‌డం ఇదే మొద‌టిసారి. వాస్త‌వానికి ఇన్నాళ్లూ ప్ర‌భుత్వంతో క‌లిసేందుకు తాలిబ‌న్లు నిరాక‌రించారు. ప్ర‌భుత్వానికి శ‌క్తి లేదు అని, అమెరికా కీలుబొమ్మ‌లంటూ తాలిబ‌న్లు ఆరోపించారు. అయితే ద‌శాబ్ధాల హింస‌కు ఫుల్‌స్టాప్ పెట్టాల‌న్న ఉద్దేశంతో చ‌ర్చ‌లు ముందుకు సాగుతున్నాయి.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/