నేడు క్రిస్‌గేల్‌కు ఆఖరి ప్రపంచకప్‌ మ్యాచ్‌

మూడు రికార్డులపై కన్నేసిన గేల్‌

Chris Gayle
Chris Gayle

లీడ్స్‌: యూనివర్సల్‌ బాస్‌, వెస్టిండీస్‌ విధ్వంసక ఆటగాడు క్రిస్‌గేల్‌ గురువారం తన చివరి ప్రపంచకప్‌ మ్యాచ్‌ ఆడబోతున్నాడు. ఈ నేపథ్యంలో కరేబియన్‌ జట్టు తరఫున సిక్సర్ల వీరుడు మూడు రికార్డులపై కన్నేశాడు. నేటి మ్యాచ్‌లో క్రిస్‌గేల్‌ 18 పరుగులు తీస్తే, విండీస్‌ తరఫు దిగ్గజ బ్యాట్స్‌మెన్‌ బ్రియన్‌లారా పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డుని బద్దలు కొడతాడు. లారా 295 మ్యాచుల్లో 10348 పరుగులు చేయగా, గేల్‌ మాత్రం ప్రస్తుతం 294 మ్యాచ్‌ల్లో 10,331 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.
అలాగే 47 పరుగులు చేస్తే ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌ తరఫున లారా పేరిటే ఉన్న అత్యధిక పరుగుల రికార్డు (1225)ని అధిగమిస్తాడు. ఇక శతకం చేస్తే ఏకంగా వివియన్‌ రిచర్డ్స్‌ సరసన చేరతాడు. మరోవైపు వెస్టిండీస్‌ ఒకే విజయంతో తొమ్మిదో స్థానంలో ఉండడంతోఈ మ్యాచ్‌ గెలిచి పరువు దక్కించుకోవాలని చూస్తుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/