అప్ఘనిస్థాన్‌లో భారీ పేలుడు…62 మంది మృతి

bomb blasts in mosque
bomb blasts in mosque

జలాలాబాద్: అప్ఘనిస్థాన్‌లో శుక్రవారం ఉగ్రవాదులు ఓ మసీదు లోపల పేలుడుకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 62 మంది మృతి చెందగా, డజన్ల మందికిపైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. తూర్పు నంగర్‌హార్ ప్రావిన్స్‌లోని హస్కా మినా జిల్లాలో ఘటన చోటు చేసుకుం ది. పేలుడులో దాదాపు 40 మంది గాయపడ్డారని పావిన్షియల్ పోలీస్ అధికార ప్రతినిధి ముబారెజ్ అట్టల్ తెలిపారు. మృతులందరూ శుక్రవారం ప్రార్థనల్లో పాల్గొనేందుకు వచ్చిన వారేనన్నారు. 50 మంది గాయపడ్డ వారితోపాటు దాదాపు 32 మృతదేహాలను తీసుకువచ్చినట్లు హస్కామినాకు చెందిన ఆస్పత్రి వైద్యుడొక రు మీడియాకు తెలిపారు. నంగర్‌హార్ ప్రావిన్స్ లో తాలిబాన్, ఐసిస్‌లు క్రియాశీలకంగా ఉన్నప్పటికీ ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదు. దేశంలో హింస ఆందోళనకరమైన స్థితికి చేరుకుందని ఐక్యరాజ్యసమితి నివేదిక ఇచ్చిన తర్వాతి రోజే ఘటన చోటు చేసుకుంది. ఐసిస్, తాలిబాన్ వంటి ప్రభుత్వ వ్యతిరేక శక్తులతోనే ప్రాణ నష్టం జరుగుతోందని, ఈ మరణాలు పూర్తిగా ఆమోదయోగ్యం కాదని ఐక్యరాజ్యసమితి పేర్కొంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/