కాబూల్‌లో భారీ పేలుళ్లు.. 19 మంది మృతి

కాబూల్‌ : ఆఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబుల్‌లోని పోలీస్ డిస్ట్రిక్ట్-10లోని మిలటరీ హాస్పిటల్ సమీపంలో రెండుబాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్ల ధాటికి 19 మంది మృత్యువాతపడగా.. 50 మంది గాయపడ్డారు. మొదటి పేలుడు సర్దార్‌ మహ్మద్‌ దావూద్‌ ఖాన్‌ ఆసుపత్రి ముందు జరగ్గా.. రెండో పేలుడు సైతం ఆసుపత్రి పరిసరాల్లోనే జరిగినట్లు ఆఫ్ఘన్‌కు చెందిన టోలో న్యూస్‌ వెల్లడించింది.

బాంబు పేలుళ్ల తర్వాత కాల్పులు కూడా జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. గతంలోనూ ఇదే ప్రాంతంలోనూ పేలుళ్లు జరిగాయి. ఆఫ్ఘన్‌లో పేలుళ్లు సర్వసాధారణమే అయినా.. తాలిబన్లు ఆక్రమించిన అనంతరం పరిస్థితులు మరింత దిగజారాయి. ఆగస్ట్‌లో ఇస్లామిక్ స్టేట్-ఖొరాసన్ ఆఫ్ఘనిస్తాన్‌లోని మసీదులు, పలు ప్రాంతాలపై వరుసగా దాడులు చేస్తున్నది.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/