వరదల బీభత్సం..151కి చేరిన మృతులు

Afghanistan flash floods

కాబూల్‌: ఆఫ్ఘనిస్తాన్‌లో ఇటీవల సంభవించిన వరదలకు మరణించిన వారి సంఖ్య 151కు చేరింది. ఒక్క పర్వాన్ ప్రావిన్స్‌లోనే ఇప్పటివరకు 93 మంది మరణించగా 110 మంది గాయపడ్డారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఈ ప్రావిన్స్‌లో 1,500 ఇండ్లు వరద ధాటికి దెబ్బతిన్నాయి. రాబోయే 24 గంటల్లో నంగర్‌హార్, కాబూల్, ఉత్తర బడాఖాన్ ప్రావిన్స్‌లోని వఖాన్ ప్రాంతంలో ఎక్కువ వర్షాలు కురవనున్నాయని ఆఫ్ఘనిస్తాన్ వాతావరణ శాఖ అంచనా వేసింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు శుక్రవారం కూడా కొనసాగుతున్నాయి. పర్వాన్, కపిసా, పంజ్‌షీర్, మైదాన్ వార్డాక్, లోగర్, పక్టియా, పక్తికా, నురిస్తాన్, నంగర్‌హార్, లాగ్మాన్, ఖోస్ట్, ఘజ్ని ప్రావిన్సులను వరదలు అతలాకుతలం చేశాయి.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/