ఆ విషయంలో పాక్‌ అఫ్గాన్‌ జోడించోద్దు

Roya Rahmani
Roya Rahmani


న్యూఢిల్లీ: అమెరికాకు అఫ్గానిస్థాన్ అంబాసిడర్‌ రోయా రహ్మానీ పాకిస్థాన్‌పై మండిపడ్డారు. కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులను అఫ్గాన్‌కు జోడించి మాట్లాడటం ఆపేయాలని ఆ దేశానికి హితవు పలికింది. ఈమేరకు రహ్మానీ ఓ లేఖను ట్విటర్‌ ద్వారా విడుదల చేశారు. తమ దేశంపై పాక్‌ అర్థరహితంగా, బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతోందని మండిపడ్డారు. అమెరికాకు పాకిస్థాన్‌ రాయబారి అసద్‌ మజీద్‌ ఖాన్‌ అఫ్గానిస్థాన్‌పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. దీనిపై గట్టిగా ప్రశ్నిస్తున్నాం. కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులు అఫ్గానిస్థాన్‌లో తీవ్ర ప్రభావం చూపుతాయన్న వారి వ్యాఖ్యలు అర్థరహితం. పాక్‌కు అఫ్గాన్‌ నుంచి ఎలాంటి ప్రమాదం లేదు. పశ్చిమ సరిహద్దుల్లో పాకిస్థాన్‌ వేలాంది మంది మిలటరీ బృందాలను ఎందుకు పెట్టిందో మాకు సరైన కారణం కనిపించడంలేదు. పాకిస్థాన్‌లో ఉండే ఉగ్రవాదుల నుంచి అఫ్గాన్‌కు తరచూ ప్రమాదాలు ఎదురవుతూనే ఉన్నాయి. మా దేశం వైపు ఉసిగొల్పేలా పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. ఒక వేళ ఇందులో పాక్‌ పాత్ర లేకపోతే బహిరంగంగా దీనిపై మాట్లాడాలి. ఉగ్రవాదంపై కఠిన చట్టాలను అమలు పరచాలి అని లేఖలో పేర్కొన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/