తాలిబాన్ల చెరలో ఉన్న భారతీయ ఇంజినీర్ల విడుదల!


గత ఏడాది మే నెలలో భారతీయ ఇంజినీర్లను అపహరించిన తాలిబాన్లు

Taliban
Taliban

న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్ల చెరలో ఉన్న ముగ్గురు భారతీయ ఇంజినీర్ల విడుదలకు మార్గం సుగమం అయింది. నిన్న తాలిబాన్ ప్రతినిధులు, అమెరికా బలగాల మధ్య జరిగిన చర్చల్లో ఈ మేరకు ఒప్పందం కుదిరినట్టు సమాచారం. ఈ ముగ్గురు ఇంజినీర్ల కోసం 11 మంది తాలిబాన్లను అమెరికా విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. అమెరికా విడుల చేయబోతున్న వారిలో తాలిబాన్ ముఖ్య నేతలు ఉన్నట్టు సమాచారం. అయితే, దీనిపై ఇంత వరకు ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం కానీ, భారత ప్రభుత్వం కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. 2018 మే నెలలో భారత ఇంజినీర్లను తాలిబాన్లు అపహరించారు. వీరిలో ఒకరిని గత మార్చిలో విడుదల చేశారు. మిగిలిన ముగ్గురు ఇప్పటికీ తాలిబాన్ల చెరలోనే ఉన్నారు. తాజాగా వీరితో పాటు, ఆస్ట్రేలియాకు చెందిన మరో ఇద్దరిని కూడా విడిచిపెట్టేందుకు తాలిబాన్లు అంగీకరించినట్టు తెలుస్తోంది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/