మ‌ళ్లీ విధుల్లో చేరిన ఆఫ్ఘ‌న్ పోలీసులు

కాబుల్: తాలిబ‌న్ల పిలుపుతో ఆఫ్ఘ‌న్ పోలీసులు మ‌ళ్లీ విధుల్లో చేరారు. ఆగ‌స్టు నెల‌లో తాలిబ‌న్లు ఆఫ్ఘ‌న్‌ను స్వాధీనం చేసుకున్న త‌ర్వాత పోలీసులు భ‌య‌ప‌డి త‌మ విధుల‌కు దూరంగా ఉన్న విష‌యం విదిత‌మే. తాలిబ‌న్ క‌మాండ‌ర్స్‌ పిలుపుతో మ‌ళ్లీ విధుల్లో చేరిన‌ట్లు పోలీసులు పేర్కొన్నారు.

కాబూల్ ఎయిర్‌పోర్టు వ‌ద్ద విధుల్లో ఉన్న పోలీసులు మాట్లాడుతూ.. తాలిబ‌న్ క‌మాండ‌ర్స్ త‌మ‌కు ఫోన్ చేసి విధుల్లోకి రావాల‌ని చెప్పారు. దాంతో తాము మ‌ళ్లీ డ్యూటీ చేయ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. ఎయిర్‌పోర్టులోని ప్ర‌ధాన భ‌వ‌నాల వ‌ద్ద‌, చెక్ పాయింట్ల వ‌ద్ద పోలీసులు విధుల్లో ఉన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/