విపక్షల ఆందోళనలు..రాజ్యసభ రేపటికి వాయిదా

నినాాదాలు చేయవద్దన్న రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య

venkaiah naidu
venkaiah naidu

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ ఉభయసభలు ఈరోజు ఢిల్లీ హంసపై అట్టుడుకుతున్నాయి. అల్లర్లపై చర్చకు రాజ్యసభలో విపక్ష సభ్యులు పట్టుబట్టారు. రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఎంత చెప్పినా వినకుండా నినాదాలు చేస్తూ, ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో విపక్ష సభ్యులపై వెంకయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చలపై ఎలాంటి నోటీసు ఇవ్వకుండా నినాదాలు చేయడం మంచిది కాదని అన్నారు. నినాదాలు చేయొద్దని చెప్పారు. ‘ఇది పార్లమెంటు… బజారు కాదు’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయినా విపక్ష సభ్యులు ఆందోళనను కొనసాగించడంతో సభను రేపటికి వాయిదా వేశారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/