కార్మికుల వేతనాలపై హైకోర్టులో విచారణ వాయిదా

హైదరాబాద్: ఆర్టీసి కార్మికులు సమ్మె చేపట్టి నేటికి 52 రోజులు గడుస్తుంది. ఒకపక్క కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించినా ప్రభుత్వం స్పందిచకపోవడం తెలిసిందే. కాగా ఆర్టీసి కార్మికుల వేతనాల పిటిషన్పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. అయితే ఏజి అందుబాటులో లేరని, మరికొంత సమయం కావాలని ఆర్టీసి స్టాండింగ్ కౌన్సిల్ న్యాయస్థానాన్ని కోరింది. దీనిపై స్పందించిన పిటిషనర్ మాట్లాడుతూ.. జీతాలు లేక ఆర్టీసి కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారన్నారు. ఇప్పటికే చాలా ఆలస్యం జరిగిందని, కార్మికులు ఇప్పటివరకు 30 మందికి పైగా ఆత్మహత్యలకు పాల్పడ్డారని పిటిషనర్ పేర్కొన్నారు. కాగా ఇరు వాదనలు విన్న ధర్మాసనం 27న పూర్తి వాదనలు వింటామని పేర్కొంది. తదుపరి విచారణను బుధవారం నాటికి వాయిదా వేసింది.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business