ఏపీ సీఎస్ గా ఆదిత్యనాథ్ బాధ్యతల స్వీకారం
ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ అడ్వైజర్‌గా నీలం సాహ్ని

Amaravati: ఏపీ నూతన సీఎస్‌గా ఆదిత్యనాథ్‌దాస్ బాధ్యతలు స్వీకరించారు.పదవీ విరమణచేస్తున్న నీలం సాహ్ని నుంచి ఆదిత్యనాథ్‌దాస్ బాధ్యతల స్వీకరించారు.
సచివాలయం మొదటి బ్లాక్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆదిత్యనాథ్ ఏపీ సీఎస్ గా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో ఆమె స్థానంలో ఆదిత్యానాథ్ దాస్‌కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించిన సంగతి విదితమే.
పదవీకాలం పూర్తి అనంతరం ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ అడ్వైజర్‌గా నీలం సాహ్ని విధులు నిర్వర్తించనున్నారు.
తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/