నామినేషన్‌ వేసిన ఆదిత్య థాకరే

aditya thackeray
aditya thackeray

ముంబయి: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వర్లీ నియోజకవర్గానికి పోటీ చేయనున్న శివసేన అధ్యక్షుడి కుమారుడు ఆదిత్య థాకరే నామినేషన్‌ వేసాడు. ఆయన తన అఫిడవిట్‌లో ఆస్తులు పేర్కొన్నారు. తనకు బిఎండబ్ల్యూ కారు ఉందని, తనపై ఒక్క క్రిమినల్‌ కేసు కూడా లేదని తెలిపారు. ఇక తనకు రూ.12 కోట్ల ఆస్తులున్నాయని అందులో 11.38 కోట్లు బాండ్లు కాగా, 77.66 లక్షలు స్థిరాస్తులుగా పేర్కొన్నారు. రూ.6.5 లక్షల నగదు ఉందని, సొంతంగా ఒక కారు ఉందని కూడా అఫిడవిట్‌లో తెలిపారు. ఆదిత్యథాకరే శివసేన అధ్యక్షుడు బాల్‌థాకరే మనుమడు. థాకరే వారసుల్లో ఎవరూ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. పార్టీ అధినేత బాల్‌ థాకరే కూడా ఎన్నిలకు దూరంగా ఉన్నారు. ఆయన కుమారుడు ఉద్ధవ్‌ థాకరే కూడా ఎన్నికల పోటీ లేరు. ప్రస్తుతం ఆయన కుమారుడు ఆదిత్య థాకరే వర్లీ నుంచి పోటీ చేస్తున్నారు. వర్లీలో ప్రచారం ప్రారంభమైంది. హౌ ఆర్‌ యు వర్లీ అంటూ పోస్టర్లతో ప్రచారం మొదలుపెట్టారు. పోస్టర్లను స్థానిక మరాఠీ, తెలుగ, ఉర్దూ, గుజరాతీ భాషల్లో ప్రచురించారు. వర్లీలో మహారాష్ట్రీయులతో పాటు తెలుగు, గుజరాతీ ప్రజలు కూడా ఉండటంతో వారిని ఆకర్షించేందుకు ఆదిత్యథాకరే ఈ ఏర్పాట్లు చేశారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/