ఆదిపురుష్ రెండో పాటను ఓ రేంజ్ లో విడుదల చేయబోతున్నారు

ఆదిపురుష్ లోని రెండో పాటను ఓ రేంజ్ లో విడుదల చేయబోతున్నారు మేకర్స్. ప్రభాస్ నటించిన పౌరాణిక చిత్రం ఆదిపురుష్ ..జూన్ 16 న పలు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో మేకర్స్ సినిమా తాలూకా ప్రమోషన్ కార్య క్రమాలను భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన ‘జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాజా రామ్’ పాట శ్రోతలను , అభిమానులను విపరీతంగా ఆకట్టుకోవడం తో ..చిత్రంలోని రెండో సాంగ్ ను భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు.

దేశ వ్యాప్తంగా ఉన్న 70కి పైగా రేడియో స్టేషన్లు జాతీయ న్యూస్ ఛానెళ్లు అవుట్డోర్ యూట్యూబ్ మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్ఫారమ్ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు టిక్కెట్ బుకింగ్ ప్లాట్ఫారమ్లు సినిమా ఛానెళ్లతో పాటు మూవీ థియేటర్లతో ఈ పాటను ప్రదర్శించేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. ప్రేక్షకుల్లోకి చాలా తొందరగా పాట తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఇలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ పాట ‘రామ్ సియా రామ్’ అంటూ సాగతుందట. మే 29 మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తున్నారు. ఇంత భారీ మొత్తంలో ప్లాన్ చేసి మరీ విడుదల చేస్తున్న ఈ పాట ఎంత వరకు ఆకట్టకుంటుందో చూడాలి.

ప్రభాస్ – కృతి సనన్ జంటగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రనౌత్ డైరెక్షన్లో ఈ మూవీ తెరకెక్కుతుంది. సాహో, రాధేశ్యామ్ సినిమాల తర్వాత రాబోతున్న ఈ మూవీ ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో సైఫ్‌ అలీఖాన్‌ లంకాధిపతి రావణాసురుడుగా కనిపిస్తుండగా రాముడి గా ప్రభాస్ , సీతగా కృతి కనిపించనున్నారు. టీ-సిరీస్‌, రెట్రో ఫైల్స్ సంస్థలు అత్యంత భారీ బడ్జెట్‌తో దాదాపు రూ.500 కోట్లతో ఈ సినిమాను నిర్మించాయి.