‘ఆదిపురుష్’ 3డి రిలీజ్ డేట్ ఫిక్స్

చెడుపై మంచి గెలిచే యుద్ధం అంటూ.. ప్రమోట్

‘Adipurush’ 3D Movie Release Date -
‘Adipurush’ 3D Movie Release Date –

రెబల్ స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా టి సిరీస్, రెట్రో ఫైల్స్ సంయుక్తం నిర్మిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ఆదిపురుష్. భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నయ్యర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. చెడుపై మంచి గెలిచే యుద్ధం అంటూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. తాజాగా మహా శివరాత్రి సందర్భంగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. జనవరి 12, 2023 సంక్రాంతి సందర్భంగా ఆదిపురుష్ సినిమాను 3డిలో విడుదల చేయనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చింది. రామాయణం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు ఓం రౌత్. భారీ బడ్జెట్‌తో ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్‌పై చూడనటువంటి అత్యద్భుతమైన విజువల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా లుక్స్‌కు మంచి అప్లాజ్ వచ్చింది. ఈ సినిమా కోసం సరికొత్త టెక్నాలజీని వాడుకున్నారు మేకర్స్. ప్రపంచంలోని అత్యున్నత సాంకేతిక నిపుణులు ఆదిపురుష్ కోసం పని చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

జాతీయ వార్తల కోసం: https://www.vaartha.com/news/national/