టిడిపికి షాక్‌..బిజెపిలోకి ఆదినారాయణరెడ్డి

Adinarayana Reddy
Adinarayana Reddy

అమరావతి: టిడిపి నేత, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి బిజెపిలో చేరుతున్నానని, ఈ విషయాన్ని టిడిపి అధినేత చంద్రబాబుకు చెప్పానని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీతో తనకు విభేదాలు లేవని… స్థానిక పరిస్థితుల నేపథ్యంలో బిజెపిలో చేరుతున్నానని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ అరాచకాలు పెచ్చుమీరుతున్నాయని… జగన్ దాష్టీకాలను ఎదుర్కోవాలంటే బిజెపిలాంటి గట్టి పార్టీ అవసరమని తెలిపారు. తన అనుచరుల కోసమే పార్టీ మారుతున్నానని చెప్పారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో పార్టీలో చేరాలా? లేదా తన నియోజకవర్గంలో బహిరంగసభ ఏర్పాటు చేసి చేరాలా? అనే విషయంపై ఈరోజు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/