సోయం బాపూరావుకు కేంద్ర కేబినెట్ లో చోటు దక్కబోతుందా..?

అంటే అవుననే అంటున్నాయి బిజెపి వర్గాలు. ప్రస్తుతం బిజెపి సర్కార్ తెలంగాణ ఫై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణ కాషాయం జెండా ఎగురవేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుత బిజెపి నేతలకు కీలక పదవులు అప్పగించి మిగతా నేతల్లో ఉత్సహం నింపుతున్నారు. ఇప్పటికే కేంద్ర కేబినెట్ లో కిషన్ రెడ్డి కి చోటు ఇవ్వగా..ఇక ఇప్పుడు మరో నేతకు ఛాన్స్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది.

కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులకు కసరత్తు బిజెపి సర్కార్. నాలుగు శాఖల మినహా మిగతా శాఖల్లో మార్పులు చేయబోతున్నారట. కొందరు మంత్రులు, సహాయ మంత్రులకు ఉద్వాసన పలకాలని డిసైడ్ అయ్యారట. అంతే కాదు ఇప్పటికే వాళ్లకు పరోక్షంగా సంకేతాలిచ్చినట్టు సమాచారం. బడ్జెట్ సమావేశాలకు ముందే మార్పులకు అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు కేబినెట్ విస్తరణలో పెద్దపీట వేయబోతున్నారట. అందులో భాగంగా తెలంగాణ నుంచి ఇప్పటికే కిషన్ రెడ్డి కేంద్రంలో కేబినెట్ ర్యాంక్ మంత్రిగా కొనసాగుతుండగా, అసెంబ్లీ ఎన్నికలతో శ్రేణులకు మరింత ఊపునిచ్చేలా రాష్ట్రానికి రెండో బెర్త్ కూడా కేటాయించే అవకాశాలున్నాయి. ఈ మధ్యే రాజ్యసభకు ఎన్నికైన లక్షణ్ ఈ రేసులో ముందున్నారు. ఆదివాసీల పోడు భూముల అంశం కొద్ది నెలలుగా రగులుతోన్న క్రమంలో సీఎం కేసీఆర్ ను మరింత ఇరుకున పెట్టేలా ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావును కేంద్ర కేబినెట్ లోకి చేర్చుకోవాలని బిజెపి చూస్తుందట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు.