ఢిల్లీ అల్లర్ల చర్చపై ప్రభుత్వం పారిపోతుంది

ఢీల్లీలో రక్తంతో హోలీ ఆడుతున్నారు

adhir ranjan chowdhury
adhir ranjan chowdhury

న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీ అల్లర్లలో ఇప్పటివరకు 47 మంది ప్రాణాలు కోల్పోయారని దీనిపై పార్లమెంట్‌లో వెంటనే చర్చించాలని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు అధీర్‌ రంజన్‌ చౌదరి డిమాండ్‌ చేశారు. దీనిపై స్పందించి స్పీకర్‌ ఓం బిర్లా మాట్లాడుతూ..హోలీ పండగ తర్వాత సభలో చర్చ జరుగుతుందన్నారు. కాగా దీనికి అధిర్‌ రంజన్‌ స్పందిస్తూ.. ఇది చాలా తీవ్రమైన విషయమని, చర్చకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా చర్చ నుంచి ప్రభుత్వం పారిపోతుందని, అంతలా ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. కాగా హోలీ గురించి మాట్లాడేది మీరా..ఢిల్లీలో రక్తంతో హోలీ ఆడుతున్నారని అధీర్‌ రంజన్‌ చౌదరి ఘాటైన విమర్శలు చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/