తగినంత నిద్ర అవసరం

మహిళలకు ప్రత్యేకం-

Sleeping
Sleeping

ఆరోగ్యంగా ఉండటానికి నిద్ర కూడా అవసరం. కాబట్టి తగినంత నిద్రపోవడానికి ప్రయత్నించాలి. రోజుకు 8 నుండి 10 గ్లాసుల నీరు తాగాలి.

పెదవులు పగిలిపోకుండా లిప్‌ బామ్‌ రాసుకోవాలి. ఎక్స్పైరీ పూర్తయిన బ్యూటీ ఉత్పత్తులను వాడటం ఆపేయాలి.

జుట్టు తత్వాన్ని బట్టి తరచూ నూనె రాస్తూ ఉండాలి. తరచూ సౌందర్య ఉత్పత్తులు మార్చవద్దు. ఎప్పుడూ ఒకే రకాన్ని వాడటం మంచిది.

మేకప్‌ బ్రష్‌లను సరిగ్గా శుభ్రం చేస్తూ ఉండాలి. చర్మం ఆరోగ్యానికి రసాయన రహిత, సహజ మేకప్‌, బ్యూటీ ఉత్పత్తులను ఉపయోగించాలి.

Sleeping

గ్రేవీ పలుచగా అయినపుడు అందులో ఉడికించిన బంగాళాదుంపను మెత్తగా చేసి కలిపితే గ్రేవీ చిక్కగా తయారవుతుంది.

అన్నం వండేటప్పుడు అందులో కొద్దిగా వంటనూనె వేస్తే అన్నం ముద్దవకుండా పొడిపొడిగా వస్తుంది.

పులుసు కూరల్లో చింతపండు రసానికి బదులుగా టమోటా గుజ్జు వేస్తే కూరలు ఎంతో రుచిగా ఉంటాయి.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/