అదనపు రుణాలు తీసుకునేందుకు ఐదు రాష్ట్రాలకు అనుమతి

కేంద్ర ఆర్థికశాఖ కీలక నిర్ణయం

Five states are allowed to take out additional loans'
Five states are allowed to take out additional loans’

అమరావతి: అదనపు రుణాలు తీసుకునేందుకు ఐదు రాష్ట్రా లకు తాజాగా కేంద్రం అనుమతి ఇచ్చింది. ఆ మేరకు కేంద్ర ఆర్దిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా ఐదు రాష్ట్రా లు చేపట్టిన సంస్కరణల కారణంగా అధిక రుణం తీసుకునేందుకు కేంద్ర ఆర్ధిక శాఖ ఆమోదం తెలిపింది.

తెలంగాణ రాష్ట్రానికి రూ.2508 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కి రూ.2525 కోట్ల అదనపు రుణాలు పొందేందుకు వెసులుబాటు ఇచ్చింది. సులభతర వాణిజ్య సంస్కరణలు అమలు చేసినందుకు కేంద్రం ఈ వెసులుబాటు ఇచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మధ్య ప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఐదు రాష్ట్రాలకు కలిసి రూ.16728 కోట్లు తీసు కునే వీలుంది. ఒకేదేశం – ఒకే రేషన్‌, పట్టణ స్థానిక సంస్థలు, విద్యుత్‌ రంగ సంస్కరణలు అమలు చేసినందుకు అదనపు రుణాలు తీసుకునే వెసులుబాటును కేం ద్రప్రభుత్వం కల్పించింది.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/