మద్యానికి బానిసలై… పిచ్చాసుపత్రికి భాధితులు

ఒక్కరోజే 94 కేసులు.. 46 మంది పరిస్థితి విషమం

mental health hospital
mental health hospital

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని నివారించేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ విదించింది. కాని ఇది మందుబాబులకు శాపంగా మారింది. రాష్ట్రంలో మద్యం దుకాణాలు, కల్లు కంపౌండ్‌లు అన్ని మూతపడ్డాయి. దీంతో మద్యానికి బానిసైన వారు వింతగా ప్రవర్తిస్తున్నారు. మరికొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 13 మంది ఆత్మహత్య చేసుకోగా.. మరో 20 మంది ఆత్మహత్యాయత్నాలకు పాల్పడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వందలాదిమంది పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తు, ఎర్రగడ్డ మానసిక వైద్యశాలకు పోటెత్తుతున్నారు. నిన్న ఒక్కరోజే ఆసుపత్రికి 94మంది రాగా వారిలో 46 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని అడ్మిట్‌ చేసుకున్నారు. కాగా ఎవరైనా మద్యానికి అలవాటు పడిన వారిలో.. పిచ్చిగా ప్రవర్తించడం, రోడ్లపై పరుగులు పెట్టడం, వంటి లక్షణాలు కనిపిస్తే వారిని వెంటనే ఆసుపత్రికి తీసుకురావాలని వైద్యులు సూచిస్తున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/