అదానీ: ప్రపంచ కుబేరుల్లో 40వ స్థానం

రోజు సంపాదన ..రూ.449 కోట్లు

Adani
Adani

ముంబై: ఈ ఏడాది భారత కుబేరుల్లో అత్యంత ఎక్కువ సంపాదన అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీది.

ఈ ఏడాది సంపద సృష్టిలో ఆయన ఏకంగా ఆసియా కుబేరుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీని వెనక్కి నెట్టేశాయి.

బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్‌ ఇండెక్స్‌ సూచి ప్రకారం గౌతమ్‌ అదానీ సంపద 19.1బిలియన్‌ డాలర్లు పెరిగింది. ముఖేష్‌ అంబానీ రాబడి 16.4బిలియన్‌ డాలర్ల కంటే ఇది చాలా ఎక్కువ కావడం విశేషం.

భారత కరెన్సీ రూపాయల్లో 2020లో ఈ పదిన్నర నెలల కాలంలో అదానీ రూ.1.41లక్షల కోట్లు ఆర్జించాయి.

కరోనా నేపథ్యంలో కొన్ని రంగాలు భారీగా పుంజుకోవడంతో ప్రపంచ వ్యాప్తంగా కొంతమంది బిజినెస్‌మెన్‌ భారీగా సంపాదించారు.

2020 జనవరి నుంచి నవంబరు మధ్య నాటికి అంటే పదిన్నర నెలల్లో మొత్తం రూ.1.41లక్షల కోట్లు అంటే అదానీ ఆదాయం రోజుకు రూ.449కోట్లు.

అదానీ భారత్‌లో ఈ ఏడాది సంపాదనలో ముఖేష్‌ అంబానీని దాటడమే కాదు. ప్రపంచవ్యాప్తంగా ఈ కాలంలో భారీగా ఆర్జించిన టాప్‌ 10లో తొమ్మిదో స్థానంలో నిలిచారు.

స్టీవ్‌ బాల్మర్‌, లారీ ఫేజ్‌, బిల్‌గేట్స్‌ తదితరుల సరసన నిలిచారు.

అదానీ సంపద మొత్తం 30.4బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. దీంతో ప్రపంచ కుబేరుల జాబితాలో 40వ స్థానంలో నిలిచారు.

అదానీ గ్రీన్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ గ్యాస్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌ స్టాక్స్‌ ఈ ఏడాది భారీగా పెరిగాయి.

అదానీ గ్రీన్‌ ఎనర్జీ, స్టాక్స్‌ 551శాతం పెరిగాయి. అదానీ గ్యాస్‌ స్టాక్స్‌ 103 శాతం, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 85శాతం పెరిగాయి. అదానీ ట్రాన్స్‌మిషన్‌ 38శాతం, అదానీ పోర్ట్స్‌ 4శాతం, అదానీ పవర్‌ 38శాతం పుంజుకున్నాయి.

1988లో తన 32యేళ్ల వయసులో గౌతమ్‌ అదానీ కమోడిటీ ట్రేడర్‌గా ప్రారంభించి ఇప్పుడు పోర్ట్స్‌, ఎయిర్‌పోర్ట్స్‌, ఎనర్జీ, రిసోర్సెస్‌, లాజిస్టిక్స్‌, అగ్రిబిజినెస్‌, రియల్‌ ఎస్టేట్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌, డిఫెన్స్‌ బిజినెస్‌ తదితర వ్యాపారాల్లో ఉన్నారు.

ఇక రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ సంపద ఈ పదిన్నర నెలలకాలంలో 16.4బిలియన్‌ డాలర్లు పెరిగింది. దీంతో ఆయన మొత్తం సంపద 75 బిలియన్‌ డాలర్లుగా ఉంది.

బ్లూమ్‌ బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ ప్రకారం ప్రపంచ కుబేరుల్లో అతను 10వ స్థానంలో ఉన్నారు.

అంతర్జాతీయంగా చూస్తే టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ సంపద 92 బిలియన్‌ డాలర్ల నుంచి 120 బిలియన్‌ డాలర్లకు పెరిగింది.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/