కవలలకు జన్మనిచ్చిన నటి నమిత

జెమినీ ఫేమ్ నమిత పండంటి కవలలకు జన్మనిచ్చింది. సొంతం, జెమిని, సింహా వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నమిత కవలలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్నీ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టు ద్వారా అభిమానులతో పంచుకుంది. చెన్నై సమీపంలోని క్రోమ్‌పేటలో ఉన్న రేలా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో పండంటి ఇద్దరు మగ శిశువులకు జన్మనిచ్చినట్టు తెలిపారు.

‘నాకు ట్విన్ బాయ్స్ పుట్టారు. కృష్ణాష్టమి రోజున(శుక్రవారం)ఈ గుడ్‌న్యూస్‌ను మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది. మీ ఆశీర్వాదాలు, ప్రేమ మాపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము అని తెలిపింది. సొంతం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన నమిత వెంకటేశ్‌తో నటించిన జెమిని సినిమాతో పాపులారిటీ సంపాదించుకుంది. తమిళ, తెలుగు, కన్నడ, హిందీ సినిమాల్లో నటించి అతి తక్కువ సమయంలోనే స్టార్‌ హీరోయిన్‌గా క్రేజ్‌ దక్కించుకుంది. 2017లో ప్రియుడు వీరేంద్ర చౌదరిని పెళ్లి చేసుకుంది. ఇక నమితకు ట్విన్స్‌ పుట్టారని తెలిసి పలువురు ప్రముఖులు సహా నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.