ప్రముఖ నటుడు సత్యజిత్ ఆరోగ్యం విషమం

ప్రముఖ నటుడు సత్యజిత్ ఆరోగ్యం విషమం

చిత్రసీమలో వరుస మరణాలు , రోడ్డు ప్రమాదాలు , డ్రగ్స్ వ్యవహారాలు సినీ ప్రముఖులను , అభిమానులను కలవరపెడుతున్నాయి. ఇప్పటికే పలువురు మృతి చెందగా..ఇక ఇప్పుడు శాండల్‌వుడ్ సీనియర్ నటుడు సత్యజిత్ ఆరోగ్యం విషమంగా ఉండనే వార్త అందర్నీ కలవరపెడుతుంది. గత కొంతకాలంగా సత్యజిత్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం విషమం కావడంతో బెంగళూరులోని బోరింగ్ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు.

ఇటీవల ఆయనకు పచ్చకామెర్లు సోకడంతోపాటు శుక్రవారం గుండెపోటు కూడా వచ్చింది. దీంతో వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. 71 ఏళ్ల సత్యజిత్ ఆరోగ్యం ప్రస్తుతం విషమంగా ఉందని తెలుస్తోంది. బీపీ, మధుమేహం కూడా ఉండడంతో ఆయన శరీరం చికిత్సకు స్పందించడం లేదని సత్యజిత్ కుమారుడు ఆకాశ్‌జిత్ తెలిపారు. చికిత్స ఖర్చుల నిమిత్తం ఫిలిం చాంబర్, ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు.