అనారోగ్యం తో హాస్పటల్ లో చేరిన నటుడు శరత్ బాబు

ఈ మధ్య సినీ నటి నటులు వరుసపెట్టి అనారోగ్యాలకు గురై అవుతున్నారు. రకరకాల జబ్బులకు గురవుతూ..చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా సీనియర్ నటుడు శరత్ బాబు సైతం అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తుంది. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శరత్ బాబు.. తెలుగుతో పాటు తమిళం, కన్నడ సినిమా పరిశ్రమల్లోనూ ఎన్నో సినిమాలో నటించారు. కొన్నేళ్లు పాటు వెండితెరపై కనిపించి సందడి చేసిన శరత్ బాబు ఇటీవల చాలా తక్కువగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన చెన్నైలో నివాసం ఉంటున్నారు. అయితే ఆయన అనారోగ్యానికి గురికాడం తో కుటుంబ సభ్యులు హాస్పటల్ లో జాయిన్ చేసారని సమాచారం.

పలువురు సినీ ప్రముఖులు ఆయన క్షేమంగా ఉండాలని దేవుడిని ప్రార్థించారు. నటి కరాటే కళ్యాణి సైతం శరత్ బాబు కోలుకోవాలని దేవుడిని ప్రార్థించారు. అదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. “నాకు ఇష్టమైన హీరో అప్పట్లో అమ్మాయిల కలల రాకుమారుడు శరత్ బాబు గారు తొందరగా కోలుకోలవాని మనం స్వామిని వేడుకొందాం” అంటూ ఆమె పోస్ట్ చేశారు.