రెండో పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చిన పాపులర్ నటుడు

ప్రముఖ నటుడు , దర్శకుడు శివ సోదరుడు బాలా రెండోసారి ఓ ఇంటివాడయ్యాడు. ఎలిజబెత్‌ ఉదయన్‌ అనే వైద్యురాలిని రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. గత కొద్దీ రోజులుగా వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు ప్రచారం కాగా..ఆ ప్రచారానికి వీరిద్దరూ తెరదించారు. సోషల్ మీడియా ద్వారా తన భార్యను అభిమానులకు పరిచయం చేసాడు. రిసెప్షన్‌లో తన భార్యతో కలిసి దిగిన ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఈ ఫోటో చూసి అభిమానులంతా షాక్ అవుతూ..వారికీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

2010లో బాలా ప్లేబ్యాక్‌ సింగర్‌ అమృత సురేశ్‌ను వివాహం చేసుకున్నారు. కానీ వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో 2019లో విడిపోయారు. వీరికి అవంతిక అనే కూతురు కూడా ఉంది. ఇక బాలా సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం తమిళం, మలయాళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇక రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘అన్నాత్తే’ చిత్రంలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.