సీఎం జగన్ తో అలీ సమావేశం

నేడు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చిన అలీ

అమరావతి : సినీనటుడు, వైస్సార్సీపీ నేత అలీ నేడు సీఎం జగన్ ను కలిశారు. ఇటీవల ఇతర సినీ ప్రముఖులతో కలిసి తన వద్దకు వచ్చిన అలీని, మరోసారి కలవాలంటూ సీఎం జగన్ చెప్పినట్టు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో అలీ నేడు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. సీఎం జగన్ తో సమావేశమయ్యారు. అలీకి వైస్సార్సీపీ తరఫున రాజ్యసభ అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

2019 ఎన్నికల వేళ అలీ వైస్సార్సీపీ తీర్థుం పుచ్చుకోవడం తెలిసిందే. గుంటూరు అసెంబ్లీ స్థానాన్ని అలీ ఆశించినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే, వైస్సార్సీపీ అధినాయకత్వం మరోలా ఆలోచించింది. అయినప్పటికీ అలీ పార్టీ కోసం విస్తృతస్థాయిలో ప్రచారం చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/