వీర సింహారెడ్డి లో ఏకంగా 11 యాక్షన్ సీన్లు ఉన్నాయట

అఖండ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న నందమూరి బాలకృష్ణ..ఇప్పుడు సంక్రాంతి బరిలో వీరసింహారెడ్డి గా రాబోతున్నారు. క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తన 107 వ సినిమాగా ఈ మూవీ తెరకెక్కుతుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం తాలూకా ఓ అప్డేట్ అభిమానుల్లో అంచనాలు రెట్టింపు చేస్తుంది.

ఈ మూవీలో ఒకటి , రెండు కాదు ఏకంగా 11 యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ఉంటాయన్నది తాజా అప్‌డేట్‌. పక్కా బాలయ్య మార్క్ యాక్షన్‌ స్టంట్స్‌ ఫ్యాన్స్‌కు గూజ్‌ బంప్స్ తెప్పించబోతున్నాయట. మామూలుగా బాలయ్య సినిమా అంటే యాక్షన్‌ పార్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు నెవ్వర్ బిఫోర్ అన్న క్లారిటీ రావటంతో వీర సింహారెడ్డి మీద అంచనాలు మరింతగా పెరిగిపోతున్నాయి. మరి ఆ యాక్షన్ సీన్లు ఎలా ఉండబోతాయో చూడాలి.

ఇక ఈ మూవీ లో బాల‌కృష్ణ‌కు జోడీగా శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. క‌న్న‌డ యాక్ట‌ర్ దునియా విజ‌య్ ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఎస్ఎస్‌. థ‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక ఈ మూవీ తర్వాత బాల‌కృష్ణ.. అనీల్ రావిపూడితో ఓ యాక్ష‌న్ సినిమా చేయ‌నున్నాడు. ఫాద‌ర్‌-డాట‌ర్ సెంటిమెంట్ నేప‌థ్యంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో ‘పెళ్ళిసంద‌D’ ఫేం శ్రీలీలా, బాల‌కృష్ణ‌కు కూతురిగా న‌టిస్తుంది.